Sunday, March 22, 2026
E-PAPER
Homeఖమ్మందార్శనిక దేవాలయాలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు

దార్శనిక దేవాలయాలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు

- Advertisement -

లక్ష్మీపురం స్కూల్ పనుల్లో వేగం పెంచండి
అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
నవతెలంగాణ – బోనకల్

విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. విద్య కోసం పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్ తరాలను నిర్మించడం కోసం పెట్టే పెట్టుబడిగా ఆయన అభివర్ణించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని ఆదివారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న భవన సముదాయాలను కలియతిరుగుతూ ఆయన పరిశీలన చేశారు. నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను, గుత్తేదారులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. 

ఈ సందర్భంగా జూనియర్ హాస్టల్, జూనియర్, సీనియర్,  అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా పరిశీలించారు. అంతేకాకుండా మెకానికల్, సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ల్యాబ్ భవనాల నిర్మాణాలను పరిశీలించారు.నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దు అని ఆయన అధికారులను ఆదేశించారు. ఇవి కేవలం భవనాలు కాదు రేపటి తరాలను ఉజ్వలంగా నిర్మించే దార్శనిక దేవాలయాలుగా ఆయన అభివర్ణించారు. దేశంలో విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగంలో ఉండేవిధంగా విద్యారంగాన్ని తీర్చి దిద్దుతున్నామని తెలిపారు.

విద్యారంగంలో అనేక సంస్కారంలో తీసుకు వస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో పూర్తిగా రూపురేఖలే మారనున్నాయి అన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి అనేక కొత్త విధానాలను అమలులోకి తీసుకువస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మేధావులను తయారు చేయడమే తమ లక్ష్యం అన్నారు. ప్రపంచంలో నాలుగు మూలల ఎక్కడికి వెళ్లినా తెలంగాణ మేధావులు ఉండేవిధంగా విద్యారంగాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -