– అడ్డొచ్చిన యువకుని తల్లికి కత్తిపోట్లు
– భూపాలపల్లి జిల్లాలో ఘటన
నవతెలంగాణ-గణపురం
ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్న జంటపై యువతి సోదరుడు కత్తితో దాడికి యత్నించాడు. ఆ సమయంలో అడ్డుకోబోయిన యువకుని తల్లిని పొడిచాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాషబోయిన రాజయ్య కూతురు జ్యోతి (ముదిరాజ్ సామాజిక తరగతి), అదే గ్రామానికి చెందిన కౌటం ప్రశాంత్ (మున్నూరు కాపు)ను ఐదు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరూ వేరే చోట నివాసం ఉండి ఇటీవల స్వగ్రామానికి వచ్చి ప్రశాంత్ ఇంట్లో ఉంటున్నారు. కాగా, వారి ప్రేమ వివాహాన్ని ఒప్పుకోని జ్యోతి సోదరుడు సాయి శనివారం రాత్రి వారింటికెళ్లి ఆమెపై, ప్రశాంత్‌పై కత్తితో దాడి చేసే క్రమంలో ప్రశాంత్ తల్లి లక్ష్మి అడ్డు వచ్చింది. దీంతో ఆమె కత్తిపోట్లకు గురికావడంతో వెంటనే స్థానికులు భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కులాంతర వివాహ జంటపై దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES