- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి తెలంగాణాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి, సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మొదలై మార్చి 12 లోగా పూర్తవుతాయి. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి చివరి వారం నుంచే ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది.
- Advertisement -