Friday, February 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇంటర్‌ హాల్‌టికెట్లు విడుదల

ఇంటర్‌ హాల్‌టికెట్లు విడుదల

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌ టికెట్లను బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షలను దాదాపు 9.9 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థుల హాల్‌టికెట్లను వారి కళాశాలల లాగిన్స్‌ నుంచి తీసుకోవచ్చు. ఇప్పటికే విద్యార్థులు, సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు సమాచారం అందించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ ఏడాది ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా వారి పరీక్షా కేంద్రాన్ని సులభంగా తెలుసుకునే వీలుంది. దీంతో పాటు రిజిస్టర్డ్‌ మొబైళ్లకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా ఎస్‌ఎంఎస్‌ లింక్‌ను అందిస్తున్నారు.

ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ షెడ్యూల్‌
తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పరిధిలో ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను ఆ సొసైటీ డైరెక్టర్‌ పి.వి.శ్రీహరి విడుదల చేశారు. ఏప్రిల్‌ 20 నుంచి 27 వరకు థియరీ, ఏప్రిల్‌ 28 నుంచి మే 5 వరకు ప్రాక్టికల్స్‌ పరీక్షలను నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -