Wednesday, November 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రగతి మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.304 కోట్ల విడుదల

ప్రగతి మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.304 కోట్ల విడుదల

- Advertisement -

– మంత్రి పొన్నం అందజేత
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలోని ప్రగతి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 304 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్టు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో హుస్నాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ఏడు మండలాల స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. 5329 స్వయం సహాయక సంఘాలకు రూ.5.66 కోట్ల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో పరిశ్రమలతోపాటు, మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడా నికి బ్యాంకర్లు ముందుకు వస్తున్నారని చెప్పారు. మారు తున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఎంతమేరకైనా రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ రుణాలకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని గుర్తు చేశారు. 18 సంవత్సరాల పైన ఉన్న వారందరూ మహిళా సంఘాల్లో చేరాలని సూచించారు. తద్వారా ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు అన్ని రకాలు గా అండగా ఉంటుందన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -