Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూనియర్ కళాశాలని తనిఖీ చేసిన ఇంటర్మీడియట్ అధికారి షేక్ సలాం..

జూనియర్ కళాశాలని తనిఖీ చేసిన ఇంటర్మీడియట్ అధికారి షేక్ సలాం..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి షేక్ సలాం మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో నెలకొన్న జనరల్ సమస్యలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి విద్యార్థులకు , అధ్యాపకులకు తెలుసుకున్నారు. కలశాన ఆవరణ మొత్తం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేశారు. విద్యార్థులు ఉపయోగించే మరుగుదొడ్లు,  టాయిలెట్లను పరిశీలించారు. అనంతరం జిల్లా ఇంటర్మీడియట్ అధికారి షేక్ సలాం మాట్లాడారు. జూనియర్ కళాశాలకు వివిధ మరమ్మత్తుల కొరకు అమ్మ ఆదర్శ పాఠశాల లో భాగంగా 21 లక్షల రూపాయలను బడ్జెట్ నిధులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా పనులను పర్యవేక్షించడానికి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రావడం జరిగింది అని తెలిపారు. అలాగే తరగతుల్ని కూడా పర్యవేక్షించి అధ్యాపకులనీ పలు విషయాలు మాట్లాడుతూ.. వారికి దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మోహన్ రెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -