Tuesday, November 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండిసెంబర్‌ 19 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం

డిసెంబర్‌ 19 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం

- Advertisement -

లోగోను ఆవిష్కరించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వచ్చేనెల19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌లో హైదరాబాద్‌ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన లోగోను గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం ఛీఫ్‌ ప్యాట్రన్‌ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకులు సి ఉమా మహేశ్వరరావు, లఘు చిత్రోత్సవ నిర్వాహకులు దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిలిం స్టడీస్‌ ప్రిన్సిపల్‌ నందన్‌ బాబు, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కార్యనిర్వహక అధికారి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ లఘుచిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశవ్యాప్తంగా పలు చలన చిత్రోత్సవాలు జరుగుతున్నా ఈ స్థాయిలో అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం నిర్వహించడం పట్ల గవర్నర్‌ నిర్వాహకులను అభినందించారు. హైదరాబాద్‌ సంస్కృతి సంప్రదాయాలకు ఈ లోగో దర్పణం పడుతోందని ఆయన ప్రశంసించారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో హైదరాబాద్‌కు విశేషమైన స్థానం ఉందన్నారు. ఈ లఘుచిత్రోత్సవాల ద్వారా నగరం కొత్తదనాన్ని సంతరించుకోవాలని ఆయన ఆకాంక్షిం చారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించిన ప్రాథమిక అవగాహన కల్పించేందుకు లఘుచిత్రాలు కీలకమైన సాధనంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రియాంక మాట్లాడుతూ దేశంలో ఈ స్థాయిలో లఘుచిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేకంగా మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించటం ఇదే మొదటి సారి అని చెప్పారు.

రానున్న కాలంలో హైదరాబాద్‌ ను అంతర్జాతీయ చలనచిత్ర యవనికలో ఓ ప్రాధాన్యత కలిగిన కేంద్రంగా అభివృద్ధి చేయటానికి ఈ లఘుచిత్రోత్సవాలు ఉపయోగపడతాయని అన్నారు. భారదేశంలోనే హైదరాబాద్‌ను చలనచిత్ర హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చలన చిత్ర అభివృద్ధి సంస్థ నిర్విరామంగా కృషి చేస్తోందని వివరించారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో పిలిం స్క్రీన్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని అన్నారు. ఈ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవాల నిర్వహణలో తెలంగాణ చిలన చిత్ర అభివృద్ధి సంస్థ ప్రధాన భాగస్వామిగా ఉండటం ఎంతో సంతోషించదగ్గ విషయమనీ, ఈ ఉత్సవాలు విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. లఘుచిత్రోత్సవం ఛీఫ్‌ పాట్రెన్‌ సి ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ వచ్చేనెల 19 నుంచి 21 వరకు నిర్వహించబోతున్న ఈ లఘు చిత్రోత్సవాలు ఆధునిక ప్రపంచ సంస్కృతితో తెలంగాణ సంస్కృతి పెనవేసుకోవడానికి ఓ వేదికగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా సినీ రంగ నిపుణులతో జరిగే ప్యానెల్‌ చర్చల్లో చలన చిత్ర అభివృద్ధికి సంబంధించిన ఎన్నో విషయాలు చర్చించనున్నట్టు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -