Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆక్స్ఫర్డ్ లో అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం

ఆక్స్ఫర్డ్ లో అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర
అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలోని  ఆక్స్ఫర్డ్ పాఠశాలలో తెలుగు ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించాము. ఈ కార్యక్రమం పాఠశాల ప్రాంగణంలో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి ప్రసంగాలు చేశారు. తెలుగు పద్యాలు, పాటలు,   అందరినీ ఆకట్టుకున్నారు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అనే నినాదంతో పాఠశాల మొత్తం తెలుగు స్ఫూర్తితో కళకళలాడింది.

తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబమని ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థుల్లో మాతృభాష పట్ల ప్రేమ, గౌరవం పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ వేడుక విజయవంతం కావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -