Saturday, May 24, 2025
Homeఆదిలాబాద్ఎడ్ బిడ్ లో భూవివాదంపై విచారణ‌

ఎడ్ బిడ్ లో భూవివాదంపై విచారణ‌

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్                 
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో శుక్రవారం రోజు భూవివాదం పై భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ అవినాష్ కూమార్ లు విచారణ జరిపారు. కొంతమంది  తన భూమి ని ఆక్రమించి ఇండ్లు నిర్మించుకున్నారని బాధితుడు కొందపురం సాయాన్న  ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు పిర్యాదు చేశారు. దీంతో  భూ వివాదం పై సమగ్ర విచారణ జరిపి  నివేదిక ఇవ్వాలని ఆర్డీవో, ఎఎస్పీ కీ  కమీషన్ ఆదేశించింది. ఇందులో బాగంగా ఆర్డీవో, ఎఎస్పీ గ్రామానికి వెళ్ళి బాధితుడు,తో పాటు భూవివాదంలో  సంబందం ఉన్న వారిని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు.భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు లు ఇరువురు అందజేయాలని సూచించారు. వివాదం లో ఉన్న భూమికి కొలతలు నిర్వహించాలని మండల సర్వేయర్ ప్రవీణ్ ను ఆదేశించారు. దీంతో తహశీల్దార్ శ్రీలత ఆధ్వర్యంలో సర్వేయర్ తోపాటు, ఆర్ఐ లు నారాయణ రావు పటేల్, సరస్వతి, రెవెన్యూ సిబ్బంది  భూమికి కొలతలు నిర్వహించె పనుల్లో నిమగ్నమయ్యారు. ఈకార్యక్రమంలో సిఐ మల్లేష్, ఎస్ఐ సంజీవ్, పంచాయతీ కార్యదర్శి శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -