Tuesday, October 7, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఫార్మాలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు

ఫార్మాలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు

- Advertisement -

ముందుకొచ్చిన అమెరికా కంపెనీ ఎల్‌ లిల్లీ
హైదరాబాద్‌ నుంచే ఔషధాల తయారీ.. సేవల విస్తరణ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కంపెనీ ప్రతినిధుల కీలక చర్చలు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎల్‌లిల్లీ దేశంలోనే మొదటి సారిగా తమ తయారీ హబ్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్టు ప్రకటిం చింది. ఒక బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.9000 కోట్లు) భారీ పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటేడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని కంపెనీ ప్రతినిధులు కలుసుకుని కీలక చర్చలు జరిపారు. అనంతరం కంపెనీ తమ విస్తరణ ప్రణా ళికలు, తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే తయారీ క్వాలిటీ హబ్‌ తమకు అత్యంత కీలకమైందని కంపెనీ ప్రకటించింది. తయారీ సామర్థ్యం, పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణను ఇక్కడి నుంచే దేశ వ్యాప్తంగా అందించనుంది. కొత్త హబ్‌ ఏర్పాటుతో వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగా వకాశాలు లభిస్తాయి. వీలైనంత తొందరలోనే కెమి స్టులు, అనలిటికల్‌ సైంట ిస్టులు, క్వాలిటీ కంట్రోల్‌, మేనేజ్‌మెట్లు నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ ప్రతిని ధులు తెలిపారు. డయాబెటిస్‌, ఓబెసిటీ, ఆల్జీమర్‌, క్యాన్సర్‌, ఇమ్యూన్‌ వ్యాధులకు సంబంధించిన ఔష ధాలు, కొత్త ఆవిష్క రణలపై కంపెనీ పని చేస్తుంది. ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్‌, బెంగుళూరులో ఎల్‌లిల్లీ కంపెనీ కార్యకలా పాలున్నాయి. హైదరా బాద్‌లో ఈ ఏడాది ఆగస్ట్‌లోనే గ్లోబల్‌ కెపాబులిటీ సెంటర్‌ను ప్రారంభించింది.

తెలంగాణకు గర్వకారణం: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రపంచ దిగ్గజ ఫార్మా కంపెనీ ఎల్‌లిల్లీ భారీ పెట్టుబడులకు ముందుకు రావడం తెలంగాణకు గర్వ కారణమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంపై నమ్మకముంచినందుకు కంపెనీ ప్రతినిధులను అభినందించారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్ధతు ఇస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ఇప్పటికే దేశంలోనే ఫార్మా హబ్‌గా పేరొందిందనీ, ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నదని చెప్పారు. 1961లో ఐడీపీఎల్‌ స్థాపించినప్పటి నుంచే హైదరాబాద్‌ దిగ్గజ ఫార్మా కంపెనీలకు చిరునామాగా మారిందనీ, ప్రస్తుతం 40 శాతం బల్క్‌ డ్రగ్స్‌ ఇక్కడే తయారవుతున్నాయని గుర్తు చేశారు. జీనోమ్‌ వ్యాలీలో ఏటీసీ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామనీ, అందుకు కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎల్‌లిల్లీ కంపెనీ పెట్టుబడులు తెలంగాణలో పరిశ్రమల విస్తరణ తీరును ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌లిల్లీ సంస్థ అధ్యక్షులు ప్యాట్రిక్‌ జాన్సన్‌, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్‌ విన్సెలో టుకర్‌, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజరు కుమార్‌, సీఎం స్పెషల్‌ సెక్రెటరీ అజిత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -