నవతెలంగాణ – భువనగిరి
ఈనెల 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను మున్సిపల్ పరిధిలోని పగిడిపల్లి లో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఈ వేడుకలను జయప్రదం చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో జిల్లా అధికారి టి నాగిరెడ్డి తెలిపారు. 1994లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ గిరిజన తెగల దినోత్సవం గా ప్రకటించింది అన్నారు.
స్వదేశి సమాజాల గొప్ప సంస్కృతులు, సహకారాలను గుర్తించడానికి ఈ దినోత్సవాన్ని మన ప్రాంతంలో నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణాలో, నృత్యాలు, కళలు, చేతిపనులు మరియు ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలు పేదరికం, స్ధానబ్రంశం వంటి సమస్యలతో సహా స్వదేశి జనాభా ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి అవగాహనా పెంచడం, వారి హక్కులు మరియు సంస్కృతిక పరిరక్షణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు.