వాషింగ్టన్ : ఇరాన్‌పై తాము చేపట్టిన యుద్ధం ముగిసిన తర్వాత ఆ దేశాన్ని పాలించేందుకు ఇరాన్ పాలనా వర్గంలోనే ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని, అదే అత్యుత్తమ ఎంపిక అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ మనస్సులో వున్న వారిలో చాలామంది ఇప్పటికే చనిపోయారని ఆయన వెల్లడించారు. ఓవల్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరికొంతమందితో ఇంకో గ్రూపు కూడా వుందని, అయితే అందులో కూడా కొంతమంది చనిపోయినట్లు వార్తలందుతున్నాయని అన్నారు.
ఇరాన్‌లో ప్రస్తుతమున్న ప్రభుత్వాన్ని కూలదోయడం, తమ మాట వినేవారికి పాలనా పగ్గాలు అందించమే ఈ దాడుల లక్ష్యమని ట్రంప్ మాటలతో మరోసారి స్పష్టమైంది. ‘ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోండి’ అంటూ నాలుగు రోజుల క్రితమే ఇరాన్ ప్రజలను రెచ్చగొట్టేలా పిలుపునిచ్చారు. దేశానికి కొత్త నేతగా పనికివస్తారని తాము భావించిన చాలామంది ఖమేనీ లక్ష్యంగా జరిగిన దాడుల్లో చనిపోయారని ట్రంప్ చెప్పారు. ఆ దాడిలో ఖమేనీతో పాటూ పలువురు సైనిక ఉన్నతాధికారులు కూడా అశువులు బాశారు.
మా చేతిలో కీలుబొమ్మే ఇరాన్ గద్దెపై వుండాలి : ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



