Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎఫ్ జి కే ఎల్ ఐ ద్వారా అత్యధిక రైతులకు సాగునీరు అందాలి

ఎఫ్ జి కే ఎల్ ఐ ద్వారా అత్యధిక రైతులకు సాగునీరు అందాలి

- Advertisement -

పెండింగ్ పనులపై సమీక్షలో జిల్లా కలెక్టర్ ఆదేశం

నవతెలంగాణ వనపర్తి

మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా వనపర్తి జిల్లాలోని అత్యధిక రైతులకు సాగు నీరు అందించే విధంగా పెండింగ్ లో ఉన్న కెనాల్ పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్, ప్రత్యేక ఉప కలెక్టర్ భూసేకరణ, ఇరిగేషన్, సర్వే అధికారులతో పెండింగ్ లో ఉన్న భూసేకరణ పై సమీక్ష నిర్వహించారు. కే.ఎల్.ఐ. కు సంబంధించిన కాలువలు, రిజర్వాయర్ ల భూసేకరణ పూర్తి చేసి భూమిని ఇరిగేషన్ శాఖ కు అప్పగిస్తే పనులు త్వరగా పూర్తి అయి రైతులకు సాగు నీరు అందుతుందని కలెక్టర్ వివరించారు. ప్రాజెక్ట్ వారీగా సమీక్ష నిర్వహిస్తూ గోపాల్పేట మండలం జయన్న తిర్మలాపూర్ ప్రాంతానికి చెందిన 12.95 ఎకరాల భూసేకరణ సర్వే పూర్తి అయినందున మార్కెట్ విలువ నిర్ధారించి అవార్డు పాస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 15 వరకు ప్రాథమిక నోటీసు ప్రచురించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రేవల్లి మండలం కేశంపేట గ్రామ పరిధిలోని 29.94 ఎకరాలకు సంబంధించి భూసేకరణ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయించాలని సూచించారు. రెమద్దుల పరిధిలోని డి – 8 భూసేకరణ కు సంబంధించి ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు పెగ్ మార్కింగ్ ఫిక్స్ చేయాలని ఆదేశించారు. దత్తాయిపల్లి, బుద్ధారం, షాపూర్, మల్కాపూర్ పరిధికి సంబంధించి భూసేకరణ చేయాల్సిన భూములకు ఎంజాయ్ మెంట్ సర్వే చేస్తూ మిషన్ భగీరథ, ఉద్యానవన శాఖ అధికారులతో బోర్లు, వృక్షాల నివేదికలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా బుద్ధారం గ్రామ పరిధిలోని 109.17 ఎకరాల్లో ఉన్న స్ట్రక్చర్ పేమెంట్ పూర్తి చేసి స్థలాన్ని ఇరిగేషన్ శాఖకు అప్పగించాల్సిందిగా సూచించారు.

ఘనపూర్ మండలంలోని గణప సముద్రం ఎఫ్.ఆర్.ఎల్ కు సంబంధించిన 197.09 ఎకరాలకు సంబంధించిన ఎంజాయ్మెంట్ సర్వే త్వరగా పూర్తి చేయాలని సర్వే అధికారిని ఆదేశించారు. కాంచెరువు, చందాపూర్, సవాయిగూడెం, పెద్దగూడెం కు సంబంధించిన భూ సేకరణ రిపోర్టు ను అటవీ శాఖకు సంబంధించిన పర్వేష్ పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సిందిగా సూచించారు.

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జిల్లాలోని అత్యధిక రైతులకు సాగునీరు అందించే విధంగా కాలువల నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు భూసేకరణ వేగవంతం చేయాల్సి ఉంటుందని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్ శాఖ ఎస్.ఈ చంద్రశేఖర్, కేశవ్ రావు, ఈ.ఈ మధుసూదన్, ఏ.డి సర్వేల్యాండ్ బాలకృష్ణ, డి. సెక్షన్ సూపరింటెండెంట్ మధు, గోకుల్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad