Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంనిరసన చెప్పడం నేరమా !

నిరసన చెప్పడం నేరమా !

- Advertisement -

మెడ, రెండు చేతులు విరిగేలా ఖాకీ జులుం
ఢిల్లీ పోలీసుల వీరంగం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు నాణ్యత దిగజారుతున్నందుకు నిరసనగా ఆదివారం న్యూఢిల్లీలోని ఇండియా గేట్‌ సమీపంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆమ్‌ఆద్మీ సర్కార్‌ నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చాక కూడా అక్కడ వాయు నాణ్యత మరింతగా దిగజారుతోంది. ఆదివారం మొత్తం వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 381 వద్ద నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) తెలిపింది.గాలి నాణ్యత దిగజారుతున్న తీరుపై ఇండియాగేట్‌ వద్ద నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. స్వచ్చంధంగా ప్రజలు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే ఢిల్లీలోని డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌కు మింగుడుపడటంలేదు. మాకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తారా? అంటూ ఢిల్లీలోని బీజేపీ సర్కార్‌ ఆదేశాలతో పోలీసులు విరుచుకుపడ్డారు. ఓ నిరసన కారుడ్ని కిందపడేసి మెడ మీద చేయివేసి బలంగా నోక్కుతుంటే..మరో ఇద్దరు పోలీసులు రెక్కలు విరిగేలా జులుం ప్రదర్శించారు. అయినా కాలుష్య నాణ్యతపై మా పోరాటం ఆగదని నిరసనకారులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -