Tuesday, September 30, 2025
E-PAPER
Homeఖమ్మంమహిళా పక్షం అంటూనే వారిపై శ్రమ దోపిడీనా.?

మహిళా పక్షం అంటూనే వారిపై శ్రమ దోపిడీనా.?

- Advertisement -

– నాయకుడు పాపారావు
నవతెలంగాణ – అశ్వారావుపేట

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతం అంటూ వేదికలు పై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే మంత్రులు గిరిజన వసతి గృహాలు,ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే మహిళా కార్మికులు శ్రమ దోపీడీ కి పాల్పడుతున్నారని, దినసరి కార్మికులు అత్యధికులు మహిళలే నని హాస్టల్ ఆశ్రమ పాఠశాలల వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర నాయకులు పాపారావు అన్నారు. దినసరి కార్మికుల డిమాండ్ లు న్యాయ సమ్మతమైన వే నని, వెంటనే పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచించి, జేఏసీ ని చర్చలకు పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం దినసరి కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె 19 వ రోజుకు చేరుకుంది.

సమ్మె శిబిరాన్ని పాపారావు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కాంగ్రెస్ ప్రభుత్వం నెల నెలా ఇచ్చే వేతనాన్ని హఠాత్తుగా తగ్గించి దినసరి కార్మికుల పొట్ట మీద కొట్టిందని ఆవేదన వ్యక్తం చేసారు.ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల్లో 50 సంవత్సరాలు పైబడిన వారే అనేకమంది ఉన్నారని, వారికి ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలలో పని భారం విపరీతంగా పెంచిందని, కానీ జీతం సగానికి పైగా తగ్గించడం బాధాకరం అన్నారు. దినసరి కార్మికులకు పాత పద్ధతిలోనే కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని లేనియెడల టైం స్కేల్ వర్కర్స్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ బైట నాగేశ్వరరావు మురహరి రఘు బత్తుల శ్రీను అరుణ లక్ష్మి పద్మ బుచ్చన్న కరుణాకర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -