- Advertisement -
న్యూఢిల్లీ : పాత పెన్షన్ పథకానికి కేంద్రం స్వస్తి చెప్పినట్లే కన్పిస్తోంది. ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించే ఆలోచన ఏదీ లేదని ఎనిమిదో వేతన సంఘానికి నోటిఫై చేసిన నిబంధనల్లో కేంద్రం సూచనప్రాయంగా తెలియజేసింది. 2004 తర్వాత కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన ఉద్యోగులు ఎన్‌పీఎస్, యూపీఎస్ స్థానంలో పాత పెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓపీఎస్ అమలు చేస్తే పడే ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మాత్రమే వేతన సంఘానికి కేంద్రం సూచించింది. అభివృద్ధి వ్యయం, సంక్షేమ పథకాలకు అవసరమైన ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరింది.
- Advertisement -

