Wednesday, October 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజా ఒప్పందానికి ఇజ్రాయిల్‌ తూట్లు

గాజా ఒప్పందానికి ఇజ్రాయిల్‌ తూట్లు

- Advertisement -

– కొనసాగుతున్న వైమానిక దాడులు, కాల్పులు
– ఇప్పటికే వంద మంది పాలస్తీనియన్ల మృతి
గాజా : పశ్చిమాసియాలో శాంతి స్థాపన ఎండమావిగానే మిగిలి పోతుందా? అక్కడ సమీప భవిష్యత్తులో శాంతి పవనాలు వీచే అవకాశాలే లేవా? తాజా పరిణామా లను గమనిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుం ది. ఈ నెల 10వ తేదీన హమాస్‌, ఇజ్రాయిల్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇజ్రాయిల్‌ దళాల ఉపసం హరణ, బందీలు-ఖైదీల మార్పిడి కూడా మొదలైంది. అంతా సజావుగా సాగుతోందని అనుకుంటున్న సమయం లో ఇజ్రాయిల్‌ మళ్లీ గాజాపై విరుచుకు పడుతోంది. వైమానిక దాడులు, కాల్పులు కొనసాగిస్తోంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. ఒప్పందాన్ని మళ్లీ పట్టాలెక్కించడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దూతలు దూతలు తమ దౌత్యాన్ని తిరిగి ప్రారంభించారు.

స్వస్థలాలకు చేరుకుంటున్న వారినీ వదలడం లేదు
కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇజ్రాయిల్‌ దళాలు జరుపుతున్న వైమానిక దాడుల్లో ఇప్పటి వరకూ వంద మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పో యారు. గడచిన 24 గంటల కాలంలో గాజాలోని ఆస్పత్రులకు 13 మృతదే హాలను చేర్చారు. ఇజ్రాయిల్‌ దాడిలో గాయాలపాలైన ఎనిమిది మందికి చికిత్స అందిస్తున్నారు. ఇంత కాలం సహాయ శిబిరాలలో తలదా చుకొని, ఆనందంతో తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్న వారిపై కూడా ఇజ్రాయిల్‌ సైనికులు అమాను షంగా కాల్పులు జరుపుతున్నారు. అల్‌-షాప్‌ ప్రాంతంలో తాజాగా జరిగిన కాల్పుల్లో నలుగురు పాలస్తీనియన్లు చనిపో యారు. అయితే ఈ ఘటనపై ఇజ్రా యిల్‌ వితండవాదం చేస్తోంది. తుఫా సమీపంలోని షుజాయేలో పాలస్తీని యన్లు కాల్పుల విరమణ సరిహద్దును దాటి తన దళాల వైపు వచ్చారని, తన సైనికులను హెచ్చరిం చారని చెబుతోంది. కాగా సరిహద్దు సరిగా కన్పించకపోవడంతో గాజా వాసులు గందరగోళంలో పడిపో తున్నా రు. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా శిథిలాల కుప్పలు కన్పిస్తుం డడంతో సరిహద్దును గుర్తించడం కష్టంగా ఉంది. ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దుకు ఆవల ఇజ్రాయిల్‌ దళాలు మకాం వేశాయి.

పరస్పర ఆరోపణలు
కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన విషయంలో ఒకరిని ఒకరు నిందించుకుంటూ హమాస్‌, ఇజ్రాయిల్‌ పరస్పర ఆరోపణలు చేసుకుం టున్నాయి. ఒక్క ఆదివారం నాడే ఇజ్రాయిల్‌ వైమానిక దాడుల్లో 42 మంది మరణించారు. వీరిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నారు. హమాస్‌ సభ్యులు ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకే దాడులు చేస్తున్నామని ఇజ్రాయిల్‌ తన చర్యను సమర్ధించుకుంటోంది. రఫాలో ఇద్దరు సైనికులు చనిపోయారని తెలిపింది. అయితే ఈ ఆరోపణను హమాస్‌ తోసిపుచ్చింది. గాజాకు చేరుకుంటున్న సహాయ సామగ్రిని ఇజ్రాయిల్‌ సైనికులు అడ్డుకుంటున్నారని అల్‌ జజీరా మీడియా సంస్థ ప్రతినిధి తారెక్‌ అబూ అజోమ్‌ తెలిపారు. హామీ ఇచ్చిన మేరకు సహాయ సామగ్రి చేరుకోవడం లేదని గాజా ప్రభుత్వ మీడియా అధికారి ఒకరు చెప్పారు. సోమవారం సాయంత్రానికి 6,600 ట్రక్కులు చేరుకోవాల్సి ఉండగా కేవలం 986 సహాయ ట్రక్కులు మాత్రమే వచ్చాయని ఆయన అన్నారు.

నెతన్యాహూతో అమెరికా ప్రతినిధుల భేటీ
కాగా గాజాలో తాజా పరిణామాలను గమనించిన ట్రంప్‌ ఇద్దరు ప్రతినిధులను ఇజ్రాయిల్‌కు పంపారు. ట్రంప్‌ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్‌కాఫ్‌, ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌లు ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూను కలిశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఆయన సతీమణి ఉషా వాన్స్‌ కూడా మంగళవారం నెతన్యాహూతో సమావేశమయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయవద్దని వాన్స్‌ ఈ సందర్భంగా నెతన్యాహూను కోరారు. ఇదిలావుం డగా ఈజిప్ట్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ హసన్‌ మహమూద్‌ రషీద్‌ మంగళవారం ఇజ్రాయిల్‌లో అమెరికా ప్రతినిధులతో సమావేశమ య్యారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశానికి ఇజ్రాయిల్‌ అధికారులు కూడా హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -