– 120 మంది పాలస్తీనియన్ల మృతి
– చర్చలు జరపాలంటే సాయం అందాల్సిందే : హమాస్
– గాజా అమ్మకానికేమీ లేదంటూ వ్యాఖ్యలు
గాజా : గాజాపై ఇజ్రాయిల్ అమానుషంగా కొనసాగిస్తున్న భీకర దాడుల్లో 120మంది మరణించినట్లు పాలస్తీనా సహాయక సిబ్బంది బృందం వెల్లడించింది. గురువారం తెల్లవారుజాము నుండి ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న బాంబు దాడుల్లో మరణించిన వారి సంఖ్య 120కి పెరిగిందని గాజా పౌర రక్షణ సంస్థ తెలిపింది.
ఇదిలావుండగా, ఈ నెలాఖరు నాటికి మానవతా సాయం పంపిణీని ప్రారంభించనున్నట్లు అమెరికా మద్దతు గల ఒక స్వచ్ఛంద సంస్థ తెలిపింది. హమాస్‌పై ఒత్తిడి పెంచే ఉద్దేశ్యంతో మార్చి 2 నుండి గాజాకు సాయాన్ని ఇజ్రాయిల్ నిలిపివేసింది. అయితే, చర్చలు జరపాలంటే ముందుగా యుద్ధంతో అతలాకుతలమైన గాజాకు మానవతా సాయాన్ని పునరుద్ధరించడమన్నది కనీస అవసరమని హమాస్ వ్యాఖ్యానించింది.
గాజాకు మానవతా సాయం అందడం సానుకూల, నిర్మాణాత్మక చర్చలకు కనీస అవసరమని హమాస్ సీనియర్ అధికారి బాసెం నయూమ్ స్పష్టం చేశారు. ఆహారం, నీరు, మందులు వంటి ప్రాధమిక అవసరాలను పొందడం హక్కు గానీ చర్చలకు సంబంధించిన అంశం కాదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
తగిన ఆహారం అందక అనేకమంది కరువు కాటకాల బారిన పడి మరణిస్తున్నారని, తాము గాజాలో పరిస్థితులను చూస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. గాజాను తాము స్వాధీనం చేసుకుని ఫ్రీడమ్ జోన్‌గా మారుస్తామని ట్రంప్ తిరిగి వ్యాఖ్యానించడంతో గాజా అమ్మకానికి రడీగా లేదని హమాస్ వ్యాఖ్యానించింది.
ఆహారం, నీరు, ఇంధనం, మందులు వంటి నిత్యావసరాలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయని గత కొన్ని వారాలుగా ఐక్యరాజ్యసమితి సంస్థలు హెచ్చరిస్తునే వస్తున్నాయి. మంగళవారం దాడుల తర్వాత గాజాలో కేన్సర్ మరియు గుండె సంరక్షణను అందించే చివరి ఆస్పత్రి పనిచేయడం ఆగిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తెలిపింది. దాడుల్లో పోగా ఇంకా మిగిలున్నవారిని ఇజ్రాయిల్ ఈ రకంగా చంపుతోంది అని పాలస్తీనాలో ఐరాస ప్రత్యేక దూత ఫ్రాన్సిస్కా ఆల్బనీస్ వ్యాఖ్యానించారు. డెర్ అల్-బలాV్‌ాపై జరిగిన దాడి అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక దాడులు చాలని, యుద్ధం ముగియాలని తాము ప్రార్థిస్తున్నామని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ యుద్ధానికి ఇక స్వస్తి చెప్పేలా అన్ని అంతర్జాతీయ సంస్థలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
గాజాపై ఇజ్రాయిల్ భీకర దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES