Monday, November 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌ మిలిటరీ చీఫ్‌ లీగల్‌ ఆఫీసర్‌ రాజీనామా

ఇజ్రాయిల్‌ మిలిటరీ చీఫ్‌ లీగల్‌ ఆఫీసర్‌ రాజీనామా

- Advertisement -

గతేడాది వివాదాస్పద వీడియో లీక్‌కు బాధ్యత వహిస్తూ రిజైన్‌
తన చర్యను సమర్థించుకున్న యిఫాత్‌ యెరుషాల్మీ


టెల్‌అవీవ్‌ : ఇజ్రాయిల్‌ సైన్యంలోని ప్రధాన న్యాయాధికారి (చీఫ్‌ లీగల్‌ ఆఫీసర్‌) అయిన అడ్వొకేట్‌ జనరల్‌ మేజర్‌-జనరల్‌ యిఫాత్‌ టోమర్‌-యెరుషాల్మీ రాజీనామా చేశారు. పాలస్తీనా ఖైదీపై ఇజ్రాయిల్‌ సైనికులు లైంగిక దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టుగా కనిపించే ఓ వీడియో గతేడాది ఆగస్టులో లీక్‌ అయిన విషయం తెలిసిందే. ఓ డిటెన్షన్‌ క్యాంప్‌లో రికార్డయిన ఆ వీడియో విడుదలకు తానే అనుమతిచ్చాననీ, అందుకే రాజీనామా చేస్తున్నానని ఆమె తన రాజీనామాలో లేఖలో పేర్కొన్నారు. కాగా ఆ సమయంలో వీడియో లీక్‌ పెను ప్రకంపనలే సృష్టించింది. ఈ ఘటనపై విచారణ అనంతరం ఐదుగురు సైనికులపై క్రిమినల్‌ కేసులూ నమోదయ్యాయి. ఈ వీడియో లీక్‌పై క్రిమినల్‌ విచారణ జరుగుతోందనీ, టోమర్‌-యెరూషాల్మీని సెలవుపై ఉంచామని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ బుధవారం తెలిపిన విషయం విదితమే.

ఆ తర్వాతే టోమర్‌-యెరూషాల్మీని రాజీనామా చేయడం గమనార్హం. కాగా ఆమె తన చర్యలను సమర్థించుకున్నారు. సైనిక న్యాయశాఖపై తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకే తాను వీడియో విడుదలకు అనుమతిచ్చానని స్పష్టం చేశారు. యుద్ధం మొత్తంలో న్యాయశాఖను అపవాదుకు గురి చేశారని వివరించారు. ఖైదీ ఎంత దుష్టుడు అయినా.. ఆయనపై అన్యాయమైన హింస అంగీకారయోగ్యం కాదు అని ఆమె తన లేఖలో వివరించారు. కాగా గతేడాది ఆగస్టులో లీకైన వివాదాస్పద వీడియో స్డే టైమాన్‌ నిర్బంధ శిబిరం నుంచి వచ్చింది. అక్కడ అక్టోబర్‌ 7, 2023న జరిగిన దాడిలో పాల్గొన్న హమాస్‌ మిలిటెంట్లు, తర్వాత గాజా యుద్ధంలో పట్టుబడిన పాలస్తీనీయులు నిర్బంధంలో ఉన్నారు. యుద్ధ సమయంలో ఇజ్రాయిల్‌ నిర్బంధ కేంద్రాల్లో పాలస్తీనియులపై తీవ్రమైన దుర్వినియోగం జరిగిందని మానవ హక్కుల సంస్థలు చెప్తూ వస్తున్నాయి. వాటన్నిటినీ నిజం చేస్తూ ఈ వీడియో లీక్‌ కావటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -