Monday, July 21, 2025
E-PAPER
Homeకరీంనగర్రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: కలెక్టర్

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: కలెక్టర్

- Advertisement -

జిల్లాలో 14 వేల నూతన రేషన్ కార్డుల పంపిణీ
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు చంద్రంపేట రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట రైతు వేదికలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలోని అర్హులైన 2610 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో మొత్తం 4527 మందిని అదనంగా చేర్చామని వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 21 వేల రేషన్ కార్డుల లబ్ధిదారులకు బియ్యం పంపిణీ అవుతున్నాయని తెలిపారు.

అన్నిటికి కీలకం…

రేషన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్ అని, ఆధార్ కార్డు, కరెంట్ కనెక్షన్ , ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, గుర్తింపు కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. జిల్లాలో నూతనంగా 14 వేల లబ్దిదారులకు రేషన్  అందించేందుకు కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేషన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. నూతన రేషన్ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, ఫించన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా కార్డు రాని వారు ఉంటే సమీపంలోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో కే కే మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎం సివిల్ సప్లై రజిత, లబ్ధిదారులు, సంబంధిత  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -