ఇక్కడే ఖర్చు పెట్టేలా చర్యలు తీసుకోవాలి
ప్రత్యేకంగా వెబ్‌సైట్ ప్రారంభించాలి : అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలో పరిశ్రమలను నెలకొల్పి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి (సీఎస్‌ఆర్) నిధులను వేరే చోట ఖర్చు చేయడం సరైంది కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎస్‌ఆర్ నిధులపైన గురువారం హైదరాబాద్‌లోని శాసన మండలి కాన్ఫరెన్స్‌హాల్‌లో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, సీఎంవో ముఖ్యకార్యదర్శి వి శేషాద్రి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి సీఎస్‌ఆర్ నిధులు వేరే చోట ఖర్చు పెడతానంటే ఎలా?అని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు వచ్చిన సీఎస్‌ఆర్ నిధులు మెరుగ్గా లేవని అన్నారు. రాష్ట్రానికి మరిన్ని సీఎస్‌ఆర్ నిధులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీఎస్‌ఆర్ నిధులు మరిన్ని తెలంగాణలో ఖర్చు పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సీఎస్‌ఆర్ నిధులు ఎక్కువ ఖర్చు చేసిన వారిని గుర్తించి ప్రభుత్వం తరపున సత్కరించాలని సూచించారు. ఈ నిధుల కోసం వెబ్‌సైట్ ప్రారంభించాలని కోరారు. సీఎస్‌ఆర్ నిధులను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో సీఎస్‌ఆర్ నిధుల కోసం అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్రం లో ఉన్న సంస్థలు కనీసం 50 శాతం సీఎస్‌ఆర్ నిధులు కచ్చితంగా ఇక్కడే ఖర్చు పెట్టాలని చెప్పారు. ఈ నిధుల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని అన్నారు.
పరిశ్రమలు తెలంగాణలో సీఎస్‌ఆర్ నిధులు వేరే చోట సరికాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



