Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యమకారులను విస్మరించడం భావ్యం కాదు 

ఉద్యమకారులను విస్మరించడం భావ్యం కాదు 

- Advertisement -

మురహరి బిక్షపతి జిల్లా ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించడం భావ్యం కాదని జిల్లా ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు మురారి బిక్షపతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో ఆనాటి ఉద్యమం పాల్గొన్న వారితో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు తమ ఉద్యమ అనుభవాలను చర్చించడం, ప్రత్యేక రాష్ట్రము కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.

ఉద్యమకారుల అకాంక్ష తొందరగా నెరవేరాలని, వారికి గుర్తింపు ఇచ్చి తగిన గౌరవం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు మురహరి బిక్షపతి మాట్లాడుతూ ఉద్యమకారులు ఎవరైనా వారు తగిన గౌరవం సమాజం లో పొందడానికి అర్హులే అని, వారిని ప్రభుత్వాలు విస్మరించడం బావ్యం కాదని,  ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు..ఈ కార్యక్రమం లో సీనియర్ ఉద్యమకారులు రేండ్ల సంతోష్, తేల్ల హరి ప్రసాద్, ఇరుగు పైడి, యాస పూలమ్మ, బత్తిని వెంకట్, శ్యామ్ సుందర్, బుర్రి సతీష్, యాస కళావతి, సమ్మక్క, కరుణాకర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -