Friday, May 16, 2025
Homeతాజా వార్తలునా వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదు: మంత్రి కొండా సురేఖ

నా వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదు: మంత్రి కొండా సురేఖ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: శాఖా పరంగా తమ వద్దకు వచ్చే ఫైళ్లను క్లియర్‌ చేసేందుకు మినిస్టర్లు డబ్బు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో హీటు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించడం సరి కాదని ఆక్షేపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు ప్రతి చిన్న పనికి కూడా డబ్బు తీసుకునే వారని అన్నారు. వాళ్లను ఉద్దేశించి మాట్లాడిన మాటలను పట్టుకుని తమ మంత్రులను అన్నట్లుగా సోషల్ మీడియాలో కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కొండా సురేఖ ఫైర్ అయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -