నవతెలంగాణ – మద్నూర్
నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా పత్తి కొనుగోళ్ల ఇండస్ట్రీలు ఉన్నాయని, సిసిఐ కొనుగోళ్ళను ఉమ్మడి జిల్లా నిబంధన పెట్టడం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు చాలా తక్కువగా ఉందని మండల పరిధిలోని పత్తి వ్యాపారులు తెలిపారు. పత్తి సీసీఐ కొనుగోళ్లకు సరిపోదని, సొంత జిల్లా నిబంధన ఎత్తివేయించి ఇతర జిల్లాల నుండి వచ్చే పత్తిని కూడా సీసీఐ ద్వారా కొనుగోలు జరపడానికి అనుమతి ఇప్పించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మాయికి మద్నూర్ మార్కెట్ పరిధిలోని సిసిఐ కొనుగోళ్ల ప్రయివేటు పత్తి మిల్లర్లు వేరువేరుగా వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తామని, ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ వ్యాపారులకు హామీ ఇచ్చారు. పక్క జిల్లా అయినా ఉమ్మడి మెదక్ జిల్లాలో పత్తి కొనుగోళ్ల ఇండస్ట్రీలు తక్కువగా ఉన్నాయని అన్నారు. ఆ ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు అధికంగా ఉంటుందని, అక్కడ రైతులు అమ్ముకోవడానికి రోజుల తరబడి వేచే చూడాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. దానిని మద్నూర్ మార్కెట్ పరిధిలో సీసీఐ కొనుగోళ్ల కేంద్రాలకు అమ్ముకునే విధంగా, అనుమతించేలా చర్యలు చేపడితే ఇక్కడ ఉన్న పత్తి మిల్లులకు కొన్ని నెలలైనా కొనసాగుతాయని అన్నారు. లేదనుకుంటే ఒకటి రెండు నెలల్లోనే పత్తి మిల్లులు మూసి వేయవలసి వస్తుందని, ఈ విషయాన్ని ప్రత్యేకంగా చొరవ చూపాలని ఎమ్మెల్యేకు సబ్ కలెక్టర్కు అందజేసిన వినతిపత్రంలో పత్తి మిల్లర్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చొరవ చూపుతామని సబ్ కలెక్టర్ ఎమ్మెల్యే వ్యాపారులకు తెలియజేశారు.
సీసీఐ కొనుగోళ్ళకు ఉమ్మడి జిల్లా నిబంధన పెట్టడం సరికాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



