– కాంప్లెక్సు హెచ్ఎం పరుచూరి హరిత
నవతెలంగాణ – అశ్వారావుపేట
పిల్లల హక్కుల్ని కాపాడడం,వారికి రక్షణగా నిలవడం పెద్దల బాధ్యత అని అశ్వారావుపేట కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అన్నారు. అశ్వారావుపేట కాంప్లెక్సు లోని పలు పాఠశాలల్లో గురువారం అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. కాంప్లెక్సు పరిధిలోని నందమూరి నగర్ ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతీ రోజూ విద్యార్ధులు పాఠశాలకు రావాలని,సెల్ ఫోన్ వాడకుండా,మాదక ద్రవ్యాల జోలికి పోకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని అన్నారు. బాల్యం అందరికి అమూల్య సంపద అని బాల్యంలో ఆనందమయ జీవితాన్ని పొందేలా పిల్లల్ని ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరూ బడిలోనే ఉండేలా చూడాలని ఆమె అన్నారు.విద్యార్ధులకు బాలల హక్కుల పట్ల అవగాహన కల్పించారు.అనంతరం విద్యార్దులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీ.ఆర్.పీ ప్రభాకరాచార్యులు, పాఠశాల ఉపాధ్యాయినిలు కరిష్మా తబుసమ్, కళ్యాణి ,విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పిల్లల హక్కుల్ని కాపాడడం పెద్దల బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


