నవతెలంగాణ – కంఠేశ్వర్ : రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ పెన్షనర్లకు పుట్టిన తేదీ రికార్డులు ఆఫీసులో దొరకటం లేదనే సాకుతో దాదాపు 936 మందికి పెన్షన్ లో జిల్లా ట్రెజరర్ అధికారులు కోత విధించారు. ఈ నేపధ్యంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నియమ, నిబంధనలకు విరుద్ధమని తక్షణమే కోత విధించిన భాగాన్ని తిరిగి చెల్లించాలని జిల్లా ట్రెజరీ అధికారి దశరథ కి మెమోరాండం సమర్పించారు. గతంలో రీకార్డులు కాలిపోయాయని, పెన్షన్ తక్కువ వచ్చిన 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లు తమ పుట్టిన తేదీలు నిర్ధారించే ఆధారాలు ట్రెజరరీ ఆఫీసులో మరల సమర్పించాలని అధికారులు తేలిపారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు ముందుగా కోత విధించిన పెన్షన్ భాగాన్ని వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు, సిర్ప హనుమాన్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ, నాయకులు మట్ట జార్జ్, పురుషోత్తం, మేరీ తదితరులు పాల్గోన్నారు.
పెన్షన్ లో కోత విధించటం అన్యాయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES