నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపు
ముంబయి : మాజీ చాంపియన్ ఇంగ్లాండ్‌ను వణికించి అందరి దృష్టిని ఆకర్షించిన నేపాల్.. గ్రూప్-సిలో రెండో మ్యాచ్‌లో దారుణంగా తేలిపోయింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఓడిన నేపాల్.. గురువారం ఇటలీతో మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. కానీ, ఆల్‌రౌండ్ షోతో రాణించిన ఇటలీ 10 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. నేపాల్ బ్యాటర్లలో ఆరిఫ్ షేక్ (27), రోహిత్ (23), అసిఫ్ (20), కరణ్ (18) రాణించారు. స్వల్ప లక్ష్యాన్ని ఇటలీ 12.4 ఓవర్లలో ఊదేసింది. ఓపెనర్లు జస్టిన్ మోస్కా (60 నాటౌట్, 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆంటోని మోస్కా (62 నాటౌట్, 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) తొలి వికెట్‌కు అజేయంగా 124 పరుగులు జోడించారు. దీంతో ఇటలీ టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయం నమోదు చేసింది.



