Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్శేత్కరి గణేష్ మండలి వద్ద రోజు పండుగే

శేత్కరి గణేష్ మండలి వద్ద రోజు పండుగే

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలో అత్యంత ఆకర్షణీయంగా అతిపెద్ద గణపతి విగ్రహాన్ని శేత్కరి గణేష్ మండలి నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ గణేష్ మండలి వద్ద ప్రతిరోజు రెండు పూటల ప్రత్యేక పూజల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో గణేష్ మండపం కిక్కిరిసిపోతుంది. భక్తులు ప్రత్యేక పూజలు నైవేద్యాలు సమర్పిస్తున్నారు. 11 రోజులు పాటు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈసారి మద్నూర్ మండల కేంద్రంలో అత్యంత ఉత్సవంగా ఆనందంగా శేత్కరి గణేష్ మండలి నిర్వాకులు ఏర్పాట్లు చేశారు. గణపతి పూజల్లో పండ్లు ఫలాలు, పెసర సెనగ గుడాలు, పులిహోర, అన్నం నైవేద్యాలు సమర్పిస్తున్నారు. శెత్కరి గణేష్ మండలి అంటే వ్యవసాయదారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహం. ఈ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం ఈ ఏడాదికి 50 ఏండ్లు పూర్తి అయ్యాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad