Wednesday, October 15, 2025
E-PAPER
Homeసినిమాఅంతకు మించి హిట్‌ ఖాయం

అంతకు మించి హిట్‌ ఖాయం

- Advertisement -

హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన కొత్త సినిమా ‘కె-ర్యాంప్‌’. హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ బ్యానర్‌ల మీద రాజేశ్‌ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్‌ నాని దర్శకత్వం వహించారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతల్లో ఒకరైన రాజేశ్‌ దండ మాట్లాడుతూ,’దర్శకుడు జైన్స్‌ నాని చెప్పిన కథ హీరో కిరణ్‌కి, నాకూ నచ్చింది. కథానుసారం కేరళ బ్యాక్‌ డ్రాప్‌ పెట్టాం. అక్కడ చేయడం వల్ల సినిమాకు కొత్త లుక్‌ వచ్చింది. విజువల్‌గా బ్యూటీ యాడ్‌ అయ్యింది. హీరోయిన్‌ కేరళ అమ్మాయి. అక్కడ కాలేజ్‌లో చేసిన సీన్స్‌, ఓనమ్‌ సాంగ్‌ విజువల్‌గా కలర్‌ఫుల్‌గా వచ్చాయి. మా సంస్థకు ప్రధాన బలం ఫ్యామిలీ ఆడియెన్స్‌. మా సంస్థలో వచ్చిన గత చిత్రాలన్నింటినీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఆదరించారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఎక్కడా ఇబ్బంది పడరు. మా సంస్థతో అల్లరి నరేష్‌కి, సందీప్‌ కిషన్‌కి ఎలాంటి మంచి అనుబంధం ఉందో కిరణ్‌తో కూడా అలాంటి రిలేషన్‌ ఏర్పడింది.

గతేడాది దీపావళికి కిరణ్‌కి ‘క’ సినిమాతో హిట్‌ దక్కింది. అంతకు మించిన విజయాన్ని మా సినిమా అందిస్తుందని ఆశిస్తున్నాం. చేతన్‌ భరద్వాజ్‌ ది బెస్ట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఆయన ఇచ్చిన బీజీఎం థియేటర్స్‌లో బ్లాస్ట్‌ అవుతుంది. ఇందులో మా పాప కూడా ఓ రోల్‌ చేసింది. శివ బొమ్మకు నా స్నేహితుడు. ఈ చిత్రంతో నాతో పాటు ప్రొడక్షన్‌లో భాగమయ్యారు. నా ఫేవరేట్‌ హీరో బాలకృష్ణతో సినిమా చేయాలనేది నా కోరిక. ‘సామజవరగమన 2’ని అదే టీమ్‌తో చేస్తాం. ప్రస్తుతం హీరోయిన్‌ సంయుక్తతో ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ మూవీ జరుగుతోంది. అన్నపూర్ణ స్డూడియోస్‌తో కలిసి అల్లరి నరేష్‌తో ఓ సినిమా నిర్మిస్తున్నాం’ అని తెలిపారు. ‘ఈ కథను ఎంతో మెచ్యూర్డ్‌గా తెరకెక్కించారు మా డైరెక్టర్‌ నాని. ప్రొడ్యూసర్‌ రాజేశ్‌తో కలిసి కంఫర్ట్‌గా ఈ మూవీకి ప్రొడక్షన్‌ చేశాం. హీరో కిరణ్‌ని ఇందులో కొత్తగా చూస్తారు. ఇదొక మంచి ఎంటర్‌టైనర్‌. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది’ అని ప్రొడ్యూసర్‌ శివ బొమ్మకు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -