Tuesday, September 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతుడిచిపెట్టుకుపోయింది..

తుడిచిపెట్టుకుపోయింది..

- Advertisement -

పంటలను నిండా ముంచిన వరదలు
మడుల్లో మోకాలు లోతులో నీరు
వరద వెంట రాళ్లు, ఇసుక మేటలు
వరి, సోయా, ఇతర పంటలకూ తీవ్ర నష్టం
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా
91,082 ఎకరాల్లో మునిగిన పంటలు
రైతుల ఆవేదన పరిహారం చెల్లించాలని డిమాండ్‌
నవతెలంగాణ- నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

రైతుల కష్టం వర్షార్పణం అయ్యింది. భారీ వర్షాలతో వచ్చి వరద.. రైతుల పెట్టుబడులను తుడిచిపెట్టేసింది. మోకాలు లోతు వరకు వరద నీరు పంటపొలాలను కమ్మేశాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా మొత్తం 91,082 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిజామాబాద్‌ జిల్లాలో 41,098 ఎకరాలు, కామారెడ్డిలో అత్యధికంగా 49,984 ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. వరదతో పాటు రాళ్లు, ఇసుక మేటలు వేయడంతో తీవ్ర నష్టం నెలకొంది. పెట్టిన పెట్టుబడులు, తమ కష్టం పూర్తిగా నీటిపాలైందని రైతులు వాపోతున్నారు. ఇసుక మేటలు తొలగించేందుకు మరింత ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరదల తాకిడితో ఎక్కడికక్కడ వరద నీరు పంటలను
ముంచెత్తాయి. వరద నీటితో పంటపొలాలు చెరువులను తలపిం చాయి. నిజామాబాద్‌ జిల్లాలో 20,660 మంది రైతులకు చెందిన 41,098 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా వరి 28 వేల ఎకరాలు, సోయాబీన్‌ 12054, మొక్కజొన్న 565 ఎకరాలతో పాటు ఇతర పంటలు నష్టపోయినట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. ఇక కామారెడ్డిలో ఏకంగా 49,984 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయా ధికారులు అంచనాలు రూపొందించారు. అధికారిక లెక్కల కంటే ఇంకా అధికంగా పంటలకు నష్టం వాటిల్లినట్టు రైతులు పేర్కొంటున్నారు.

రాళ్లు రప్పలు, ఇసుక మేటలు
పంటపొలాల్లోకి వరదతో పాటు రాళ్లు, ఇసుక వచ్చి చేరింది. ఇప్పటికే పంట నష్టపోగా.. దీనికి తోడు భూమిని మళ్లీ పంటలకు సిద్ధం చేసేందుకు డబ్బులు వెచ్చించే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. దాంతో పాటు కరెంట్‌ స్తంభాలు విరిగి పోగా.. విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా పొలాలతో పాటు బోర్లలో నీరు పోవడంతో బోరుమోటార్లు పాడైపోయాయి. ఇవన్నీ బాగు చేసేందుకు తలకుమించిన భారం అవుతుందని రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు.

విపత్తుగా ప్రకటించి పరిహారం ప్రకటించాలని రైతుల డిమాండ్‌
కాగా వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి పరిహారం ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. కేంద్రం సైతం తమ ప్రతినిధి బృందాన్ని పంపించి విచారణ చేయించి నిధులు కేటాయించాలనే డిమాండ్‌ స్థానికంగా నెలకొంది. ఎకరాకు ఇప్పటి వరకు రూ.20-25 వేల వరకు పెట్టిన పెట్టుబడులు వర్షార్పణం అయ్యాయని.. ఎకరానికి రూ.30 వేల పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

జాతీయ విపత్తుగా ప్రకటించాలి : సీపీఐ(ఎం) నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు
వరదలతో ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌తో నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం నిధులు ప్రకటించాలి. నష్టపో యిన పంటలకు ఎకరాకు రూ.20వేలు పరిహారం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేసి ఆదుకోవాలి. వర్షాలతో వ్యవసాయ కూలీలకు పనులు లేకుండా పోయాయని కావున వ్యవ సాయ కార్మిక కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.2000 చొప్పున చెల్లించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -