Saturday, November 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపర్యావరణాన్ని కాపాడుకోకపోతే అనర్థమే

పర్యావరణాన్ని కాపాడుకోకపోతే అనర్థమే

- Advertisement -

బ్రెజిల్‌ కాప్‌..30 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో యూఎన్‌ చీఫ్‌

బ్రెసిలీయా: పర్యావరణాన్ని కాపాడు కునేలా చర్యలు తీసుకోకపోతే అనర్థమేనని ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించాలి. బ్రెజిల్‌లోని బెలెమ్‌లో ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సమావేశాలు రెండు రోజులపాటు (గురు,శుక్రవారం) జరిగాయి. ప్లీనరీ సెషన్‌ ప్రారంభోత్సవానికి హాజరైన యూఎన్‌ చీఫ్‌ మాట్లాడుతూ..వాతావరణ మార్పులను పట్టించుకోకపోవటతో.. వేడి అనుహ్యంగా పెరుగుతుందని వివరించారు. ప్రపంచ దేశాల పాలకుల నిర్లక్ష్యం వల్ల వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. 2030 నాటికి ప్రపంచం 1.5 డిగ్రీల సెల్సియస్‌ వేడెక్కడం నిర్ణిత పరిమితిని దాటబోతోందని, కోలుకోలేని పరిణామాలతో తీవ్ర వేడి ఉండే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

”వాతావరణ వినాశనం నుంచి చాలా కార్పొరేషన్లు రికార్డు లాభాలను ఆర్జిస్తున్నాయి. లాబీయింగ్‌ కోసం బిలియన్ల కొద్దీ ఖర్చు చేయడం, ప్రజలను మోసం చేయడం, పురోగతిని అడ్డుకోవడమే” అని గుటెరస్‌ స్పష్టం చేశారు. అంతేకాదు ”పలు దేశాల నాయకులు ఈ స్థిర ప్రయోజనాలకు బందీలుగా ఉన్నారు.” అని కూడా చెప్పారు. శిలాజ ఇంధనాలకు సబ్సిడీ ఇవ్వడంలో దేశాలు ప్రతి సంవత్సరం సుమారు ట్రిలియను యూఎస్‌ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. అయితే నాయకులకు రెండు స్పష్టమైన ఎంపికలు ఉన్నాయని వివరించారు. అందులో ”మనం పర్యావరణ రక్షణకు నాయకత్వం వహించడాన్ని ఎంచుకోవచ్చు – లేదా వినాశనానికి దారితీయవచ్చు.”అని గుటెరస్‌ అన్నారు.

రికార్డుస్థాయిలో వేడి
కాప్‌ 30 సమావేశం ప్రపంచ వాతావరణ చర్చలు ప్రారంభమై మూడు దశాబ్దాలు పూర్తి చేసింది. ఆ సమయంలో, దేశాలు ఉద్గారాలలో అంచనా వేసిన పెరుగుదలను కొంతవరకు అరికట్టాయి. కానీ రాబోయే కొన్ని దశాబ్దాలలో తీవ్ర గ్లోబల్‌ వార్మింగ్‌గా భావించే వాటిని నిరోధించడానికి ఇది సరిపోదని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో అత్యంత వేడి ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఆగస్టు వరకు సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక పూర్వ సగటు కంటే 1.42డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉంది. 2023 , 2024లో రికార్డు స్థాయిలో వేడి నమోదైన తర్వాత. ”అసాధారణమైన ఉష్ణోగ్రతల ప్రభావం ఆందోళనకరమైన రీతిలో కొనసాగుతోంది” అని యూఎన్‌ చీఫ్‌ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -