Monday, January 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపొట్టేల్‌ ఫైట్స్‌ నేపథ్యంలో 'జాకీ'

పొట్టేల్‌ ఫైట్స్‌ నేపథ్యంలో ‘జాకీ’

- Advertisement -

పీకే7 స్టూడియోస్‌ నిర్మిస్తున్న కొత్త తమిళ సినిమా ‘జాకీ’. ఈ సినిమా మధురై గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. చెన్నైలో జరిగిన వీధి తిరువిళా-13వ ఎడిషన్‌ కార్యక్రమంలో ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. 2021లో వచ్చిన ‘మడ్డి’ సినిమా తర్వాత పీకే7 స్టూడియోస్‌ మరోసారి దర్శకుడు డా.ప్రగభల్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ప్రేమ కృష్ణదాస్‌, సి. దేవదాస్‌, జయ దేవదాస్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో యువన్‌ కృష్ణ, రిదాన్‌ కృష్ణాస్‌, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించారు. శక్తి బాలాజీ కి సంగీతం అందించారు. మధురై నేపథ్యంలో సాగే ఈ కథ గ్రామాల్లో జరిగే సంప్రదాయ పొట్టేలు పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ పోరాట సన్నివేశాలు అన్ని సహజంగా తెరకెక్కించడానికి మూడు సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలోనే చిత్ర బృందం చాలా కృషి చేసి నేటివిటీ మిస్‌ అవ్వకుండా ఈ సన్నివేశాలు చిత్రీకరణ జరిపారు. నటీనటులు కూడా నిజమైన పొట్టేలుతో శిక్షణ తీసుకొని నటించడం విశేషం. ఈ సినిమా ద్వారా గ్రామీణ జీవితం, ప్రజల భావోద్వేగాలు, సంప్రదాయ క్రీడను సహజంగా ప్రేక్షకులకు చూపించనున్నారు. టీజర్‌ విడుదలతో ఈ సినిమా ప్రయాణం మొదలైంది. మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -