Friday, September 26, 2025
E-PAPER
Homeఆటలువైస్‌ కెప్టెన్‌గా జడేజా

వైస్‌ కెప్టెన్‌గా జడేజా

- Advertisement -

దేవదత్‌ పడిక్కల్‌, జగదీశన్‌లకు పిలుపు
వెస్టిండీస్‌తో టెస్టులకు భారత జట్టు ఎంపిక

నవతెలంగాణ-దుబాయ్ : స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ భారత జట్టును గురువారం ఎంపిక చేసింది. స్టార్‌ క్రికెటర్‌, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గాయం బారిన పడటంతో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని భారత జట్టు రెండు టెస్టులు ఆడుతుందని సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ అజిత్‌ అగార్కర్‌ గురువారం దుబాయ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడిన కరుణ్‌ నాయర్‌, అభిమన్యు ఈశ్వరన్‌, ఆకాశ్‌ దీప్‌, అన్షుల్‌ కంబోజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, శార్దుల్‌ ఠాకూర్‌లను సెలక్టర్లు పక్కనపెట్టారు. గతంలో స్వదేశంలో న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఎదురైన పరిస్థితులు పునరావతం కాకుండా జట్టు కూర్పు ఉందని అజిత్‌ అగార్కర్‌ అన్నాడు. తెలుగు తేజాలు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మహ్మద్‌ సిరాజ్‌లు జట్టులో నిలిచారు. దేవదత్‌ పడిక్కల్‌, ఎన్‌ జగదీశన్‌, అక్షర్‌ పటేల్‌లు జట్టులోకి వచ్చారు. భారత్‌, వెస్టిండీస్‌ తొలి టెస్టు అక్టోబర్‌ 2 నుంచి అహ్మదాబాద్‌లో జరుగనుండగా.. అక్టోబర్‌ 10 నుంచి రెండో టెస్టు న్యూఢిల్లీలో షెడ్యూల్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -