- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల సీనియర్ సిటిజన్స్ కమిటీని మండల సీనియర్ సిటిజన్స్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సైన్డ్ల మొండయ్య ఆధ్వర్యంలో ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్షుడిగా గోపి, సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా పిట్ట రాజారావు, వి రామకృష్ణ ప్రధాన కార్యదర్శి దుర్గం, రాజలింగం, సహాయ కార్యదర్శి బి గాబ్రియల్, కోశాధికారి యాడ పుల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా మోట పలుకుల రాజలింగయ్య, కాసు లచ్చయ్య, పల్లె లచ్చన్న, కే తిరుపతిరెడ్డిని ఎకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అడ్డగురి భూమన్న, ప్రధాన కార్యదర్శి కస్తూరి, నాగేశ్వర్, మూల భాస్కర్, గౌడ్ గుర్రాల, మురళి ఇతర సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.
- Advertisement -