Magazines

నిలిచిపోయిన వర్క్‌ పర్మిట్ల పొడిగింపులు

1 గంట క్రితం

Extensions
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 2 నిమిషాల చదవడం

'540 రోజుల రక్షణ' కోల్పోతున్న భారతీయ ఉద్యోగులు

న్యూఢిల్లీ : వర్క్‌ పర్మిట్ల పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్న అర్హులైన విదేశీయులకఁ సంబంధించిన ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యు మెంట్ల (ఈఏడీలు) పొడిగింపులకు స్వస్తి చెప్పిన అమెరికా ప్రభుత్వం దానిని చట్టబద్ధం చేసింది. దీంతో అమెరికాలో పనిచేస్తున్న పది వేల మందికి పైగా భారతీయులు, వారి జీవిత భాగస్వాములు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హెచ్‌-1బీ వీసా హోల్డర్ల యొక్క హెచ్‌-4 జీవిత భాగస్వాములపై ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఈఏడీల పొడిగింపుల కోసం వేచి చూసే సమయంలో వారు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్‌ బ్యాక్‌లాగ్‌లతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న భారతీయ కుటుంబాలపై ఈ తాజా చర్య పర్యవసానాలు తీవ్రంగానే ఉండవచ్చు. హెచ్‌-4 జీవిత భాగస్వాముల్లో చాలా మంది మహిళలే. భాగస్వాములు అమెరికాలలో శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తుంటే వీరు కెరీర్‌ను నిర్మించుకుంటారు. ఈఏడీ గడువు ముగిస్తే వారంతా పని మానేయాల్సి వస్తుంది.

ఈఏడీ పొడిగింపు అంటే...

యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) వద్ద జరిగే జాప్యం కారణంగా వలసదారులు ఉద్యోగాలు కోల్పోకుండా చూడడానికి ఈఏడీల ఆటోమేటిక్‌ పొడిగింపు విధానం అమలులోకి వచ్చింది. అంటే అర్హులైన దరఖాస్తుదారుల పర్మిట్‌ గడువు ముగిసిన తర్వాత కూడా పునరుద్ధరణ ప్రక్రియ పెండింగులో ఉంటే వారు 540 రోజుల వరకూ విధులను కొనసాగించవచ్చు. అయితే ఈ నెల 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన నిబంధన కారణంగా వారికి ఆ రక్షణ ఉండదు. దరఖాస్తుదారులు సాధారణంగా తమ ఈఏడీ గడువు ముగిసిన 180 రోజుల లోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పెండింగులో ఉంటున్న దరఖాస్తుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ నాటికి 4,32,000కు పైగా ఈఏడీ పొడిగింపు దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. వీటిలో 91,000కఁ పైగా దరఖాస్తులు 18 నెలలకు పైగానే నిర్ణయం కోసం వేచిచూస్తున్నాయి.


ఎవరిపై ప్రభావం ?
ఎవరికి మినహాయింపు ?

ఈ మార్పు ఈఏడీలపై ఆధారపడే కొన్ని వర్గాల విదేశీ పౌరులపై ప్రభావం చూపుతుంది. వీరిలో హెచ్‌-1బీ ఉద్యోగుల హెచ్‌-4 జీవిత భాగస్వాములు ఉంటారు. అయితే ఈ మార్పు విదేశీ కార్మికఁలందరికీ ఒకే విధంగా వర్తించదు. ఏల్‌-1 వీసాదారుల జీవిత భాగస్వాములకు ఈఏడీ అవసరం ఉండదు. స్టెమ్‌ ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైఁంగ్‌ పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకఁనే ఎఫ్‌-1 విద్యార్థులకు కూడా మరో నిబంధన కింద ప్రత్యేకంగా 180 రోజుల మినహాయింపు లభిస్తుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే ఏడుగురు వ్యక్తులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయగా వారికి మాత్రం ఊరట లభించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్