నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలు సంస్థలు, వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించడంతో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, ఆ పెంపు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనుమతించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు శనివారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సోమవారం మెన్షన్ చేసే అవకాశం ఉంది.
34 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్
46 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)