Magazines

సుప్రీంలో విజయన్‌ పిటిషన్‌

1 గంట క్రితం

Vijayan's petition
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

కేరళం మాజీ సీఎంకు ఈడీ సమన్లపై కోర్టుకు..

న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ, కేరళంలోని కాంగ్రెస్‌ నేతృత్వ యూడీఎఫ్‌ ప్రభుత్వం కలిసికట్టు గా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పైనా, ఆయన కుటుంబంపైనా వేధింపులను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాత కేసులను తిరగదోడుతు న్నాయి. కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్‌ రుటైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌)కు సంబంధించిన ఓ కేసులో ఈ నెల 23న కొచ్చిలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశా లను సవాలు చేస్తూ పినరయి విజయన్ శుక్రవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు చేపట్టాలని విజయన్ తరపున వాదిస్తున్న న్యాయవాది కోరారు. అంతే కాకుండా, తన క్లయింట్ విజయన్‌కు కఠిన చర్యల నుంచి రక్షణ కల్పించాలని భారత ప్రధాన న్యాయ మూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌ మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జస్టిస్ సూర్య కాంత్ ఈ అంశంపై దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 26న విచారణ చేపడతామని తెలిపారు. న్యాయమూర్తులు అందుబాటులో ఉంటే, వచ్చే వారం సెలవు దినాల్లో కూడా ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకా శం ఉందని అప్పుడు పరిశీలిస్తామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్