Magazines

నేడు ఇండియా బ్లాక్‌ మహా ర్యాలీ

2 గంటల క్రితం

rally
avatar
balaji

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

13 కోట్ల మంది ఓటు హక్కు హరించిన ఎన్నికల కమిషనర్‌ రాజీనామాకు డిమాండ్‌

పది లక్షల మంది హాజరవుతారని అంచనా
ఢిల్లీలో ర్యాలీని అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు!

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, ఓటు హక్కును పరిరక్షించాలనే నినాదంతో ఇండియా బ్లాక్‌ ఆదివారం ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనుంది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) పేరుతో 13 కోట్ల మందికిపైగా ప్రజల ఓటు హక్కును తొలగించారంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే మహా ర్యాలీకి పది లక్షల మంది వరకు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది శనివారం ఉదయం నుంచే ఢిల్లీకి చేరుకున్నారు. ఇండియా బ్లాక్‌లోని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాల నుంచి తమ కార్యకర్తలను సమీకరించాయి.

ఢిల్లీ పొరుగు రాష్ట్రాలైన హర్యానా, రాజస్తాన్‌, యూపీ, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు యువజన, విద్యార్థి సంఘాలు, పౌరసమాజ ప్రతినిధులు, మేధావులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. క‌న్నాట్ ప్లేస్ నుంచి రామ్ లీలా మైదానం వ‌ర‌కు కాంగ్రెస్ ర్యాలీ చేప‌ట్టనున్న‌ట్టు రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారు. హ‌రికిష‌న్ సింగ్ సూర్జీత్‌ భవన్‌, మింటో రోడ్‌ జంక్షన్‌ తదితర ప్రాంతాల నుంచి సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు ఆదివారం మధ్యాహ్నం ర్యాలీగా రాంలీలా మైదానానికి చేరుకోనున్నారు. సూర్జీత్‌ భవన్‌ నుంచి రెండు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఉదయం నుంచే మైదానం జనసందోహంతో నిండిపోనుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా రాంలీలా మైదానంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్