రూ.20 లక్షలతో విశ్రాంతి గదుల నిర్మాణానికి భూమి పూజ
నవతెలంగాణ – పాలకుర్తి
శ్రావణమాసాన్ని పురస్కరించుకొని వరలక్ష్మి వ్రతంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో టి పి సి సి ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, ఎన్నారై డాక్టర్ హనుమండ్ల రాజేందర్ రడ్డి దంపతులు, హనుమండ్ల రాజా రామ్మోహన్ రెడ్డి లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 20 లక్షల వ్యయంతో రెండు పడక గదుల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆలయ అర్చకులను ఝాన్సీ రెడ్డి దంపతులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
సోమన్న ఆలయంలో ఝాన్సీరెడ్డి దంపతుల పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES