Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్26న ఆదిలాబాద్ సైన్స్ కళాశాలలో జాబ్ మేళా

26న ఆదిలాబాద్ సైన్స్ కళాశాలలో జాబ్ మేళా

- Advertisement -

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్ : పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26న మెగా ఫార్మా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జె. సంగీత ప్లేస్మెంట్, కెరీర్ గైడెన్స్ సెల్ ల సమన్వయకర్తలు టి మంజుల, శ్రీధరాదేవి లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేళా లో డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్, అరబిందో ఫార్మా, బయోకాన్, భారత్ బయోటెక్,  హెటెరో ల్యాబ్స్ తదితర కంపెనీలు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారికి నాలుగు నెలల పాటు హైదరాబాద్ లో శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు.వార్షిక ప్యాకేజీ రెండు నుంచి మూడు లక్షల వరకు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad