నవతెలంగాణ – ఆలేరు
ఆలేరు పట్టణంలోని ఒకటవ వార్డు కొలనుపాక రోడ్డుకు చెందిన కుంచం ఆంజనేయులుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు వివిధ రాజకీయ పార్టీలను వీడి మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు,అభివృద్ధి దిశగా సాగుతున్న పాలనపై విశ్వాసంతోనే పార్టీలో చేరినట్టు తెలిపారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో మొదటి వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చింతలఫణి సునీత శ్రీనివాస్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించుటకు అంకితభావంతో కృషి చేస్తామని మాట ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ద్వారపు శంకర్, దోనకొండ కృష్ణ,ఎం.డి.పాషా,పూల సిద్దు,బొట్ల రాజేష్,కుంచెం అజయ్, యాదగిరి,పాకాల రాకేష్,చింటూ,శివ, మధు, భాను, కొంగ రాకేష్, బొడ్డు తరుణ్ తదితరులు పాల్గొన్నారు.



