నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ సర్కార్ అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 12న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ పి. రాంచందర్, ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరించడాన్ని ఖండించారు. మోడీ సర్కారు తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. రద్దయిన 29 చట్టాల్లో జర్నలిస్టులకు సంబంధించి రెండు చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. జర్నలిస్టుల కనీస వేతనాలకు సంబంధించి గురుబక్ష్ మతీజియా వేజ్ బోర్డు సిఫారసులను అమలుచేయించకపోగా, ఉన్న చట్టాన్ని కోడ్‌గా మార్చి పాత్రికేయరంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. జాతీయ కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.12న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే సమ్మెలో విరివిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్త సమ్మెకు జర్నలిస్టుల మద్దతు : టీబ్ల్యూజేఎఫ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



