నవతెలంగాణ – జుక్కల
ఉత్తమ మెడికల్ ఆఫీసర్ గా జుక్కల్ ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ విట్టలను జిల్లా కలెక్టర్ ఎంపిక చేశారు. మారుమూల జుక్కల్ ప్రాంతంలో గత మూడేళ్లుగా డాక్టర్ వృత్తిని నిర్వహిస్తూ పేద ప్రజలకు సేవలు అదించడం జరిగింది. మారుమూల జుక్కల్ ప్రాంతంలో ఉండి నిత్యం ప్రజలకు రోగులకు అందుబాటులో ఉంటూ వారి బాగోగులు చూడడమే కాక నిత్యం సేవలందించడం వలన ఉత్తమ మెడికల్ ఆఫీసర్ గా ఎంపిక చేశారని తెలిసింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ మరియు ఎస్పి రాజేష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం తో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల వాసులు మెడికల్ ఆఫీసర్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
జుక్కల్ ఉత్తమ మెడికల్ ఆఫీసర్ గా విట్టల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



