Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరిశుభ్రంగా ముస్తాబవుతున్న జుక్కల్ బస్టాండ్

పరిశుభ్రంగా ముస్తాబవుతున్న జుక్కల్ బస్టాండ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణానికి మహర్దశ కలగడంతో, పరిసర ప్రాంతమంతా మట్టితో కప్పివేసి గుంతలను పూడ్చేసారు. బస్టాండు ఖాళీ ప్రదేశంలో మొక్కలను నాటేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. మండల కాంగ్రెస్ యూత్ నాయకుడు సతీష్ పటేల్, కార్యకర్తలు మనోహర్ పటేల్, గత మూడు రోజులుగా ఈ ప్రాంగణాన్ని పర్యవేక్షించారు. బురద ఉన్న ప్రదేశాలను మట్టితో కప్పి పనులను చేయిస్తున్నారు. దీంతో బస్టాండు ప్రాంతమంతా సుందరంగా కనిపిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం అక్కడున్న బోరును రిపేరు చేసి, మంచినీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. బస్టాండు రూపు రేఖలు మారుతున్న దృశ్యాలను ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్బంగా ఇందుకు కారణమైన ఎమ్మెల్యే కృషి పట్ల నాయకులకు, అధికారులకు మండల ప్రజలు, ప్రయాణికులు అభినందనలు తెలియజేస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -