Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి..

జుక్కల్ ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిర్లక్ష్య వైఖరి వలన ఈ రిజర్వేషన్ జుక్కల్ నియోజకవర్గంలో ఒక ఎంపీపీ & జడ్పిటిసిగా కల్పించకపోవడం లంబాడి గిరిజన సోదరులకు అవమానపరిచే విధముగా ఈ రిజర్వేషన్ ఉందని లంబాడి హక్కుల పోరాట సమితి సంఘం సభ్యులు విమర్శించారు. జుక్కల్ నియోజకవర్గంలో ఎస్టి జనాభా సుమారు 21000 వేలు కలగివున్న జనాభా, గిరిజనులకు ఒక్క ఎంపీటీసీ & జడ్పిటిసి కల్పించకపోవడం హర్ష దగ్గ విషయం మిత్రులారా..  2025 సంవత్సరం ప్రకారం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు, ఎస్టిలకు 2012 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం ఇవ్వడం ఎంతవరకు న్యాయం.. 2014 సంవత్సరంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం.. ఎస్టీల జనాభా 10% ఇవ్వాలి కదా.! రిజర్వేషన్ “జీవో నెంబర్ “9 ” 2025 సంవత్సరం బిసి లకు 42% ఎలా సాధ్యమైంది. ఎస్టిలకు 10% ఎందుకు కాదు.! బంజారా గిరిజన నాయకులు ఆలోచించమని కోరుతున్నా. బంజారా గిరిజనులకు రాజకీయంగా సమాధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో  మాన గిరిజన సోదరులు “ఐక్య మత్యం” చాటాలని కోరుచున్నా!  లంబాడి హక్కుల పోరాట సమితి సంఘం సభ్యులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -