నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 31 అర్జీలను, జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థలు కలెక్టర్ భాస్కరరావుతో కలసి అర్జీలను స్వీకరించారు. అందులో రెవిన్యూ శాఖ 25, జిల్లాపంచాయతీ మున్సిపాలిటీ, సర్వే ల్యాండ్, హోసింగ్, వైద్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,హౌసింగ్ పి.డి విజయసింగ్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి..
- Advertisement -
- Advertisement -


