Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సమాన పనికి సమాన వేతనానికై జూలై 9 సమ్మె

సమాన పనికి సమాన వేతనానికై జూలై 9 సమ్మె

- Advertisement -

రాష్ట్ర అధ్యక్షులు దాసు
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
: సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26న సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పును అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని2025 జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు పిలుపునిచ్చారు. జక్రాన్పల్లి మండల కేంద్రము లో జూన్25న పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.దాసు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ లో అగ్రభాగాన నిలిచిన సఫాయి కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని, పి ఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. 8గంటల పని విధానమే యదావిధంగా కొనసాగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు సొప్పరి గంగాధర్, సాయన్న, శేఖర్, రాజన్న, సర్వర్ లక్ష్మి,రేణుక, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad