- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మరమ్మత్తుల నిమిత్తం రూ.28 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు విడుదలై నాలుగు నెలలు కావొస్తోంది. కాగా టెండర్ల వలన పనులు ఆలస్యమైందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ టెంటర్ పనలు కూడా పూర్తయ్యాయి కాబట్టి సంబంధిత కాంట్రాక్టర్ కాలయాపన చేయకుండా వెంటనే మద్నూర్ జూనియర్ కళాశాలలో చాలా రోజులుగా నెలకొని ఉన్న మరమ్మత్తుల పనులను వెంటనే చేపట్టాలని కళాశాల విద్యార్థిననీ విద్యార్థులు కోరుతున్నారు.
- Advertisement -



