Tuesday, October 14, 2025
E-PAPER
Homeఆటలుక్లీన్‌స్వీప్‌కు మరో 58 పరుగులే

క్లీన్‌స్వీప్‌కు మరో 58 పరుగులే

- Advertisement -

భారత్‌ లక్ష్యం 121, ప్రస్తుతం 63/1
ొహోప్‌, కాంప్‌బెల్‌ శతక పోరాటం ొ భారత్‌, వెస్టిండీస్‌ రెండో టెస్టు నాల్గో రోజు

కరీబియన్లపై క్లీన్‌స్వీప్‌ విజయానికి భారత్‌ 58 పరుగుల దూరంలో నిలిచింది. 121 పరుగుల ఛేదనలో భారత్‌ ప్రస్తుతం 63/1తో నిలిచింది. రాహుల్‌ (25 నాటౌట్‌), సాయి సుదర్శన్‌ (30 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు. హోప్‌ (103), కాంప్‌బెల్‌ (115) శతక పోరాటంతో విండీస్‌ ఫాలోఆన్‌లో 390 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకుంది.

నవతెలంగాణ-న్యూఢిల్లీ
వెస్టిండీస్‌తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసేందుకు భారత్‌ రంగం సిద్ధం చేసుకుంది. ఫాలోఆన్‌లో కరీబియన్‌ బ్యాటర్ల పోరాటంతో ఇన్నింగ్స్‌ విజయానికి దూరమైన భారత్‌.. నేడు ఉదయం సెషన్లోనే అదిరే విక్టరీ లాంఛనం చేసుకుంది. స్వల్ప ఛేదనలో యశస్వి జైస్వాల్‌ (8) అవుటైనా.. కెఎల్‌ రాహుల్‌ (25 నాటౌట్‌, 54 బంతుల్లో 2 ఫోర్లు), సాయి సుదర్శన్‌ (30 నాటౌట్‌, 47 బంతుల్లో 5 ఫోర్లు) రెండో వికెట్‌కు అజేయంగా 54 పరుగులు జోడించి భారత్‌ను విజయానికి చేరువ చేశారు. అంతకుముందు వెస్టిండీస్‌ ఫాలోఆన్‌లో 118.5 ఓవర్లలో 390/10 పరుగులు చేసింది. ఓపెనర్‌ జాన్‌ కాంప్‌బెల్‌ (115, 199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), షారు హోప్‌ (103, 214 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) అసమాన సెంచరీలతో కదం తొక్కారు. భారత్‌, వెస్టిండీస్‌ రెండో టెస్టులో నేడు ఆఖరు రోజు.

ఆ ఇద్దరు మెరువగా..
జాన్‌ కాంప్‌బెల్‌ (115), షారు హోప్‌ (103) మూడో వికెట్‌కు 177 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. 49.1 ఓవర్ల పాటు భారత బౌలర్లకు వికెట్‌ నిరాకరించిన ఈ జోడీ.. విండీస్‌ను ఇన్నింగ్స్‌ ఓటమి ప్రమాదం నుంచి తప్పించింది. రోస్టన్‌ ఛేజ్‌ (40, 72 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), జస్టిన్‌ గ్రీవ్స్‌ (50 నాటౌట్‌, 85 బంతుల్లో 3 ఫోర్లు), జేడెన్‌ సీయల్స్‌ (32, 67 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ప్రతిఘటనతో భారత్‌ మరోసారి బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. 311/9తో ఉన్న విండీస్‌ను జేడెన్‌, జస్టిన్‌లు ఆఖరు వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో కుల్‌దీప్‌, బుమ్రా మూడేసి వికెట్లు పడగొట్టారు.

స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 518/10
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ : 248/10
వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ : కాంప్‌బెల్‌ (ఎల్బీ) జడేజా 115, చందర్‌పాల్‌ (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 10, అలిక్‌ (బి) సుందర్‌ 7, హోప్‌ (బి) సిరాజ్‌ 103, ఛేజ్‌ (సి) దేవదత్‌ (బి) కుల్‌దీప్‌ 40, ఇమ్లాచ్‌ (ఎల్బీ) కుల్‌దీప్‌ 12, జస్టిన్‌ నాటౌట్‌ 50, ఖారీ (సి) నితీశ్‌ (బి) కుల్‌దీప్‌ 0, వారికన్‌ (బి) బుమ్రా 3, ఫిలిప్‌ (సి) జురెల్‌ (బి) బుమ్రా 2, జేడెన్‌ (సి) సుందర్‌ (బి) బుమ్రా 32, ఎక్స్‌ట్రాలు : 16, మొత్తం : (118.5 ఓవర్లలో ఆలౌట్‌) 390.
వికెట్ల పతనం : 1-17, 2-35, 3-212, 4-271, 5-293, 6-298, 7-298, 8-307, 9-311, 10-390.
బౌలింగ్‌ : సిరాజ్‌ 15-3-43-2, జడేజా 33-10-102-1, సుందర్‌ 23-3-80-1, కుల్‌దీప్‌ 29-4-104-3, బుమ్రా 17.5-5-44-3, జైస్వాల్‌ 1-0-3-0.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : యశస్వి (సి) ఫిలిప్‌ (బి) వారికన్‌ 8, రాహుల్‌ నాటౌట్‌ 25, సుదర్శన్‌ నాటౌట్‌ 30, మొత్తం : (18 ఓవర్లలో 1 వికెట్‌కు) 63.
వికెట్ల పతనం : 1-9.
బౌలింగ్‌ : జేడెన్‌ 3-0-14-0, జోమెల్‌ 7-1-15-1, ఖారీ 6-0-24-0, ఛేజ్‌ 2-0-10-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -