Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజమనుషులకు ఇంటిపేర్లున్నట్లే

మనుషులకు ఇంటిపేర్లున్నట్లే

- Advertisement -

పుస్తకాల గదికొందరు కవులకు పుస్తకం తన పేరవుతది
కవులు,రచయితలకు,చదువర్లకు
ఇంట్లో పుస్తకాల గదులుంటాయి
అతని కేరఫ్‌ అంతా ఆ గదే
ఖండాన్తరాలు దాటి ఏ సూరుకిందనో గూడల్లుకుంటాయి
ఎందరో ఎక్కడి వాళ్ళో
మన ఇంట్లో పుస్తకాల వరుసలోకూసుని
మనల్ని పలుకరిస్తుంటరు
ర్యాక్‌ పై చేయి పడగానే నా గొడవింకా అట్లనే వున్నదని
కాళోజి లొల్లి చెస్తుంటడు
గతమే కాదు వర్త మానము
రక్తపు మడుగయ్యిందని శ్రీ శ్రీ బాధ పడుతుంటడు
అంగారం శంగారం రెంటిని
జెమిలిగా పాడుతుంటడుదాశరథి
అహంకార కండ్లద్దాలను
కొంచెం దించుమని విశ్వంబరుడంటడు
తమను నమ్మినోళ్ల తలలు
తెగిపడుతున్నాయని
గెలిలియో, డార్విన్లు దుఖిస్తుంటరు
మత్తుమందు సుమా మతమే
జీవితభ్రమావలయమవుతుందని
హెచ్చరిస్తుంటడు మార్క్స్‌
అమ్మ క్షేమం మరువొద్దు
నీకోసం పోరాడినట్లు నువ్వూ జనంకోసం బతకాలని
గోర్కి గుర్తుచేస్తుంటడు
వేళ్ళ కొనలు సుత్తిమెత్తగా పుస్తకాల గొంతులపై పడగానే
బిస్మిల్లా ఖాన్‌, బేగం అక్తర్‌, రవిశంకర్ల రాగాల తేనే తీగలు
చేతులకు చుట్టుకుంటయి
పుస్తకాలుకవుల భావ తరంగాలు
శాస్త్ర వేత్తల అవిశ్రాంత కషి ఆవిష్కరణలు
వీరుల త్యాగాల నెత్తుటి ధారలు
పుస్తకాలంటే పూటకు లేని
ప్రజాకవుల బతుకు కన్నీటిగాథలు
అందరు పోయిన్నాడు
పసిడి లాకర్లో ఉండొచ్చు, ప్లాట్లు వెంచర్లో ఉండొచ్చు
కానీ కవి పోయిన్నాడు
అతని తలాపుకు చివరిదీపంతోపాటు
నిశబ్దంగా మూలుగుతున్న పుస్తలుంటాయి
అతని ఆలోచనలు జనంలో నిలిచిపోతుంటయి.

  • డా. ఉదారి నారాయణ, 9441413666
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad